హైదరాబాద్: కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం
కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో, అర్జున్ థియేటర్ సమీపంలోని కంచుకోట టిఫిన్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన సమయంలో హోటల్ లోపల సిబ్బంది నిద్రిస్తున్నట్లు యజమాని వెల్లడించారు. ఈ అగ్ని ప్రమాదం ద్వారా ప్రాణ నష్టం జరగలేదు. కానీ, హోటల్ ఫర్నిచర్ మరియు రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి.
స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు.
భువనగిరి బై పాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం
యాదాద్రి: వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారి భువనగిరి బై పాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్య, చిన్నపాప అక్కడికక్కడే మృతి చెందగా, భర్త మరియు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులెవరో కేసముద్రం ప్రాంతానికి చెందిన వారు అని గుర్తించారు. ప్రమాదం వల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈవార్తను కూడా చదవండి:

2 thoughts on “కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం: హోటల్ ఫర్నిచర్, వాహనాలు దగ్ధం”
Comments are closed.