ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు
హైదరాబాద్, జనవరి 16: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో విచారణ కోసం మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. గురువారం ఉదయం గండిపేట ఫాంహౌస్ నుండి ఈడీ ఆఫీస్‌కు వచ్చిన కేటీఆర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో, హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు రూ.45.7 కోట్ల బదిలీపై విచారణ జరుగుతోంది. ఈ బదిలీకి సంబంధించి ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన ఈడీ, మనీలాండరింగ్ కోణంలో విచారణ చేపట్టింది.
కేటీఆర్ లీగల్ టీంకు అనుమతి ఇవ్వని ఈడీ, కేటీఆర్‌ను మాత్రమే విచారించడానికి అనుమతించింది. ఈ సందర్భంగా బషీర్‌బాగ్ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేయనున్నారు.
ఈ కేసులో, ఈనెల 9న ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే. మరోవైపు, సుప్రీంకోర్టు విచారణను నిరాకరించిన తరువాత కేటీఆర్ పిటీషన్‌ను ఉపసంహరించుకున్నారు.
హై టెన్షన్ వాతావరణం
ఈడీ విచారణ నేపథ్యంలో, బీఆర్‌ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో ఈడీ కార్యాలయం వద్ద చేరుకున్నారు. అయితే, పోలీసులు ఈ నేడే కార్యాలయం వద్దకి బీఆర్ఎస్ నేతల వాహనాలను అనుమతించలేదు. గన్ పార్క్ వద్ద వాహనాలను నిలిపివేయడంతో, నేతలు కాలినడకన ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
పోలీసుల అలర్ట్
ఈడీ కార్యాలయం వద్ద భారీగా బీఆర్ఎస్ నేతలు చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆందోళనలు జరుగుతాయనే అవకాశం ఉన్నందున, 200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. 3 ఏసీపీలు, 8 ఇన్స్పెక్టర్లు, 16 ఎస్సైలతో పాటు బాష్ప వాయు గోళాలు, వజ్ర వాహనాలు కూడా పోలీసులు సిద్ధం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి…

2 thoughts on “ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు”
Comments are closed.