వంశీకి జైల్లో భద్రత

Vamsi gets security in jail

వైఎస్సార్సీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వంశీ అనుచరులు కిడ్నాప్ చేసిన ముదునూరి సత్యవర్ధన్‌ను సోమవారం కోర్టుకు ప్రవేశపెట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. సత్యవర్ధన్, సీఆర్పీసీ 161 ప్రకారం, వంశీ అనుచరులు తనను బెదిరించి, టీడీపీ కార్యాలయంపై జరిగిన కేసులో తనకు సంబంధం లేదని చెప్పించారని వాంగ్మూలం ఇచ్చారు. ప్రస్తుతం, ఈ వాంగ్మూలాన్ని సీఆర్పీసీ 164 కింద న్యాయాధికారి ముందు నమోదు చేయాలని పోలీసులు కోర్టుకు పిటిషన్ వేశారు.

వంశీ అనుచరులపై 11 మంది పై కేసు నమోదు చేసిన పోలీసులు, వాటిలో 5 మంది అరెస్టు చేశారు. 6 మంది పరారీలో ఉన్నారు. వారు లభించడంపై పోలీసులు గాలిస్తున్నారు. విచారణ కోసం వంశీని 10 రోజులపాటు కస్టడీకి తీసుకోవాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు.

వంశీకి జైల్లో భద్రత:

ఇదిలా ఉండగా, విజయవాడ జిల్లా జైలులో వంశీకి పరదాలు కట్టినట్లు సమాచారం. భద్రతా చర్యల నేపథ్యంలో జైలు అధికారులు వంశీకి 1వ నంబర్ బ్యారక్ కేటాయించి, ఇతర ఖైదీల నుండి వంశీని ప్రత్యేకంగా రక్షించారు. సీసీటీవీ కెమెరాలు ద్వారా ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

వైఎస్ జగన్ వంశీతో ములాఖత్:

వైఎస్సార్పీ అధినేత వైఎస్ జగన్ మంగళవారం విజయవాడ జైలుకు రానున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని ఆయన పరామర్శించేందుకు వెళ్లనున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ మంగళవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుండి గాంధీనగర్ జైలుకు వెళ్లనున్నట్లు సమాచారం.

Read More

Our YouTube Channel Click Here