టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ అరెస్టు జరిగిన సంగతి తెలిసిందే. రెడ్‌బుక్ లో మొదటి పేర్లలో కొడాలినాని, వంశీ ఉంటారు. వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి, విజయవాడకి తరలించారు. కోర్టులో హాజరుపర్చిన తర్వాత, ఆయనకు రిమాండ్ విధించారు. దీంతో చర్చ కొడాలి నాని పైనే పడింది. ఈ నేపధ్యంలో తర్వాత అరెస్ట్ అయ్యే వ్యక్తి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో చంద్రబాబు, లోకేశ్ పై కొడాలి నాని చేసిన దారుణమైన విమర్శలు, టీడీపీ లో ఆగ్రహానికి కారణమయ్యాయి. అధికారంలోకి వస్తే, కొడాలి నానితో పాటు మరికొంతమందికి అంతు చూపుతామని లోకేష్ బహిరంగంగా హెచ్చరించారు. ఇటీవల అమెరికా పర్యటనలో కూడా లోకేశ్ త్వరలోనే రెడ్‌బుక్ పార్ట్-3 చూస్తామని చెప్పారు. ఇదే భాగం కింద వంశీ అరెస్ట్ అయినట్లు భావించవచ్చు. రానున్న రోజుల్లో కొడాలి నానిని కూడా ఏదో ఒక కేసులో అరెస్ట్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. పాలకులు అనుకున్నట్లయితే, ఎటువంటి కేసును సృష్టించడం పెద్ద విషయం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొడాలి నాని ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు, గుడివాడలో కనిపించడం లేదు. ఎలాగైనా నానిని ఏదో ఒక కేసులో ఇరికించాలని టీడీపీ చూస్తోంది. వంశీ అరెస్ట్ నేపథ్యం లో, నెక్స్ట్ కొడాలి నాని అనేది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న విషయం.
Our YouTube Channel Click Here
