నిరుద్యోగులకు శుభవార్త – Minister Sridhar Babu కీలక ప్రకటన
తెలంగాణలోని BTech, Degree పూర్తి చేసిన నిరుద్యోగుల కోసం IT & Industries Minister Duddilla Sridhar Babu శుభవార్త చెప్పారు. వచ్చే మూడు సంవత్సరాల్లో దాదాపు 30,000 Jobs అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ అవకాశాలను Banking, Financial Services & Insurance (BFSI) Training Course ద్వారా కల్పించనున్నట్లు తెలిపారు.
BFSI Course ద్వారా ఉద్యోగ అవకాశాలు
ఈ BFSI Skilling Courseలో శిక్షణ పొందడానికి దరఖాస్తు చేసిన అభ్యర్థులందరికీ ఇటీవల Eligibility Test నిర్వహించగా, అర్హత సాధించిన వారికి ఈ ఏడాది July నాటికి Young India Skills Universityలో శిక్షణ ప్రారంభమవుతుందని Minister Sridhar Babu తెలిపారు.
ఈ శిక్షణలో Banking Operations, Financial Markets, Insurance, Investment Banking, Software, Programming, Application & Database, Cyber Security, Cloud Computing, Soft Skills వంటి విభాగాల్లో అభ్యర్థులకు Training అందించనున్నారు. శిక్షణ పూర్తి చేసిన వారిని Hyderabadలోని *Global Capability Centers (GCCs)*లో Placements కల్పించనున్నారు.
ప్రతి సంవత్సరం 10,000 మందికి శిక్షణ
ప్రతి ఏడాది 10,000 Candidates ఈ కోర్సులో శిక్షణ పొందనుండగా, ఇందులో 5,000 మంది Engineering Graduates, 5,000 మంది Degree Graduates ఉంటారు. ఈ Training Program నిర్వహణకు కావాల్సిన ఖర్చును Equip Organization & BFSI Consortium భరిస్తాయి. అభ్యర్థులు కేవలం ₹5,000 Admission Fee మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
ఇప్పటికే Two Batches విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నాయి. Third Batch కోసం ఇటీవల Eligibility Test నిర్వహించగా, త్వరలోనే Merit List విడుదల చేయనున్నట్లు Minister Sridhar Babu తెలిపారు. Job Notifications కోసం అభ్యర్థులు SWILL University Websiteను సందర్శించాలని సూచించారు.

One thought on “నిరుద్యోగులకు శుభవార్త: వచ్చే 3 ఏళ్లలో 30 వేల ఉద్యోగాలు – మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన!”
Comments are closed.