అమెరికాలోని వైట్ హౌస్‌లో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీతో ఇదే తొలి సమావేశం. ఈ భేటీలో విదేశాంగ మంత్రి జైశంకర్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. వలసలు, వాణిజ్యం, సుంకాలు ప్రధాన చర్చాంశాలుగా, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై దృష్టి సారించారు.
అక్రమ వలసదారులపై మోదీ కీలక ప్రకటన చేశారు. అమెరికాలో అక్రమంగా ఉన్న భారతీయులను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమని, మానవ అక్రమ రవాణా అంతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇందులో భాగంగా చమురు, వాయువు వనరుల గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ, భారతదేశానికి వీటి అవసరం ఉందని అన్నారు. అలాగే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు మోదీ ట్రంప్‌కు అభినందనలు తెలిపారు.
ఇదిలా ఉండగా, సుంకాలపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశం తమ వస్తువులపై అధిక సుంకాలు విధిస్తోందని, తాము కూడా అదే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉగ్రవాదుల అప్పగింత విషయమై 26/11 దాడి సూత్రధారిని భారత్‌కు అప్పగిస్తామని, మరో కొంతమందిని కూడా అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
Our YouTube Channel Click Here
