గుంటూరు మహిళ గొప్ప త్యాగం – భర్త కోసం లివర్ దానం చేసిన విజయ!

Unexpected story of Guntur couple – Wife saves husband’s life by donating liver

గుంటూరుకు (Guntur) చెందిన గొట్టిపాటి రామక్రిష్ణ (Gottipati Ramakrishna) ఒక ఛానెల్లో రిపోర్టర్ (Channel Reporter) గా జీవితాన్ని ప్రారంభించాడు. 2005లో విజయ (Vijaya) తో ఆయనకు వివాహం (Marriage) జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు (Children) కలిగిన తర్వాత అనారోగ్య సమస్య తలెత్తింది. ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినా జాండిస్ (Jaundice) ను సరైన సమయంలో గుర్తించలేకపోవడంతో లివర్ సిరోసిస్ (Liver Cirrhosis) కు దారి తీసింది.

గుంటూరులోని పలువురు వైద్యుల (Doctors) వద్దకు వెళ్లిన తర్వాత వ్యాధి ముదిరిపోయిందని లివర్ మార్పిడి (Liver Transplant) శస్త్ర చికిత్స చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. మధ్యతరగతి కుటుంబం (Middle-Class Family) కావడంతో ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఒక వైపు ఆర్థిక భారం (Financial Burden), మరొక వైపు లివర్ దాత (Liver Donor) అందుబాటులో లేకపోవడంతో సమస్య తీవ్రతరమైంది.

2019లో వ్యాధిని గుర్తించిన తర్వాత రామక్రిష్ణ శస్త్ర చికిత్స (Surgery) చేయించుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఆరోగ్య శ్రీ (Aarogyasri) లో ఆ సమయానికి లివర్ మార్పిడి సౌకర్యం లేకపోవడంతో సీఎం రిలీఫ్ ఫండ్ (CM Relief Fund) ఆశ్రయించాలనుకున్నారు. కానీ అప్పటికే ఎన్నికల కోడ్ (Election Code) అమల్లోకి రావడంతో సాయం అందలేదు. ఈ క్రమంలో రామక్రిష్ణ భార్య విజయ (Wife Vijaya) ముందుకొచ్చింది. ఇద్దరు ఆడపిల్లలు (Two Daughters) ఉన్నా భర్తను కాపాడుకోవాలనే తపనతో లివర్ దానం (Liver Donation) చేయడానికి సిద్ధమైంది. వైద్యులు ఆమెను ఆరోగ్య పరంగా (Health Risks) హెచ్చరించినా, భర్తను రక్షించాలనే సంకల్పంతో వెనక్కి తగ్గలేదు.

హైదరాబాద్ (Hyderabad) లో విజయంతమైన లివర్ మార్పిడి ఆపరేషన్ (Liver Transplant Success)

విజయ హైదరాబాద్ (Hyderabad) కు వెళ్లి గ్లోబల్ ఆసుపత్రి (Global Hospital) లో శస్త్ర చికిత్స చేయించుకుంది. 2019 మే 30న (May 30, 2019) వైద్యులు విజయ లివర్ లో 50% భాగం (50% Liver Portion) తీసి రామకృష్ణకు అమర్చారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది.
ఆపరేషన్ కోసం అప్పటి ప్రభుత్వం (Government) కొంత సాయం అందించగా, మిగతా డబ్బును తమ ఆస్తులు (Assets) అమ్ముకుని సమకూర్చుకున్నారు. విజయ సోదరుడు (Brother) రమేష్ కూడా కుటుంబానికి సహాయం చేశాడు.

ఆపరేషన్ పూర్తయిన తర్వాత రామక్రిష్ణ (Ramakrishna) & విజయ (Vijaya) క్రమంగా కోలుకున్నారు. రామక్రిష్ణ ఒక చిన్న ఛానెల్ (Small News Channel) లో పనిచేస్తుండగా, పిల్లలు చదువుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కుటుంబంలో ఆనందం (Happiness) మాత్రం నిలిచింది.

The story of this couple is inspiring to all those who Giving Up on Life for Small Problems. Their story shows what Family Bonds should be like.