ఈ ఏడాది ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJP విజయాన్ని సాధించిందని అందరికీ తెలిసిందే. దాదాపు 27 సంవత్సరాల తర్వాత BJP ఢిల్లీలో అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతుంది. మొత్తం 70 Assembly seatsలో 48 స్థానాలను BJP గెలుచుకుంది.
Delhi: BJP Legislative Party (BJP LP) సమావేశం వాయిదా పడింది. ఈ రోజు (సోమవారం) జరగాల్సిన సమావేశం February 19కి వాయిదా వేశారు. అందరూ అనుకున్నట్లుగా Delhi New CM ఎవరో తెలియాలని ఆశించారు. అయితే, ఈ రోజు BJP Legislative Party meeting గడువు వాయిదా పడడంతో New CM నామనిర్దేశం పై ఉత్కంఠ కొనసాగుతుండగా, February 19న స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ఈ meetingలో 48 newly elected BJP MLAs పాల్గొనబోతున్నారు. అలాగే, BJP MPs కూడా హాజరుకానున్నారు. BJP Legislative Party leader ఎన్నిక తరువాత, MLAs Lieutenant Governor ను కలుస్తారు. Vinod Tawde మరియు Tarun Chugh ని BJP అధిష్టానం Coordinators గా నియమించింది. అలాగే, February 20న CM and Cabinet oath-taking తేదీ ఖరారైనది. Delhi CM Raceలో Parvesh Verma (New Delhi), Rekha Gupta (Shalimar Bagh), Vijender Gupta (Rohini), Satish Upadhyay (Malviya Nagar), Ashish Sood (Janakpuri), Pawan Sharma (Uttam Nagar), Ajay Mahawar (Ghonda) పేర్లు ప్రాచుర్యం పొందాయి.
ఈ Delhi Assembly electionsలో BJP 48 సీట్లు గెలుచుకొని, AAP పార్టీకి కేవలం 22 సీట్లు మాత్రమే లభించాయి. ముఖ్యంగా Arvind Kejriwal సహా పలువురు కీలక నాయకులు ఓటమి పాలయ్యారు. Delhi CM గా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారో అందరికీ ఆసక్తి నెలకొంది.

One thought on “ఢిల్లీ ముఖ్యమంత్రిపై ఉత్కంఠ: బీజేపీ శాసనసభాపక్ష సమావేశం వాయిదా”
Comments are closed.