సమంత డైరీ రాయడం వల్ల తన జీవితంలో వచ్చిన మార్పులు
హీరోయిన్ సమంత రూత్ ప్రభు, ఇటీవల ఇన్స్టాగ్రామ్ వేదికగా డైరీ రాయడంపై ఓ ప్రత్యేకమైన పోస్టు షేర్ చేశారు. గత రెండు సంవత్సరాలుగా డైరీ రాయడం తన జీవితంలో గేమ్ చేంజర్‌గా మారిందని వెల్లడించిన సమంత, తన అనుభవాన్ని పంచుకుంటూ, ఇతరులకూ దీన్ని ప్రయత్నించమని ప్రేరేపించారు. “డైరీ రాయడం అనేది పాత పద్ధతే. కానీ, రాస్తే మనకు ఒక తీయని జ్ఞాపకం మిగులుతుంది” అని ఆమె పేర్కొన్నారు. ఆమె చెప్పినట్లుగా, మొదట్లో డైరీ రాయడం కష్టం అనిపించవచ్చు, కానీ ఆ తర్వాత అది అలవాటుగా మారి, మనలో మనం పట్ల మార్పులు తీసుకొస్తుందని సమంత చెప్పారు. కష్టమైన క్షణాల్లో డైరీ రాయడం ఆమెకు ఉపశమనం కలిగించినట్లు చెప్పిన సమంత, ఈ విధానాన్ని తన ఫాలోవర్లతో పంచుకున్నారు.
మరోవైపు, సమంత నటించిన ‘ఖుషి’ సినిమా 2023 సెప్టెంబర్ 1న విడుదలైంది. ఈ మూవీ తర్వాత సమంత మరొక చిత్రం లో నటించలేదు. అయితే, గతేడాది ‘సీటాడెల్ హన్నీ బన్నీ’ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను పలకరించారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆమె తన అభిమానులతో అనుసంధానం కొనసాగిస్తూ, ఈ పోస్ట్ కూడా వైరల్ అయింది. ప్రస్తుతం సమంత ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది.

One thought on “సమంత డైరీ రాసే అనుభవాన్ని పంచుకుంటూ: అది నా జీవితానికి గేమ్ చేంజర్”
Comments are closed.