అమరావతి: ఏపీ సిఐడి మాజీ చీఫ్ ఎన్. సంజయ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అఖిల భారత సర్వీసుల నిబంధనలను ఉల్లంఘిస్తూ క్రమశిక్షణ రాహిత్యంతో అధికార దుర్వినియోగం చేశారని సంజయ్‌పై అభియోగాలు మోపబడిన విషయం తెలిసిందే. అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ట్యాబ్లెట్‌ల కొనుగోలు, అగ్ని మొబైల్ యాప్ అభివృద్ధి కోసం జేబు సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చారని, అక్రమాలపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలతో క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
సంజయ్‌ను ఈ విషయాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సంజయ్‌కు ఆదేశాలు ఇవ్వబడ్డాయి. అలాగే, ఆయనపై రాజకీయ ఒత్తిడి రాకుండా చూసేందుకు సంజయ్‌కు హెచ్చరికలు జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా సంజయ్‌ను సస్పెండ్ చేసిన విషయం కూడా తెలిసిందే.
ఇంతలో, సంజయ్ తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించాడు. సోమవారం విచారణ జరిగిన అనంతరం, మంగళవారం కోర్టు తీర్పు ఇవ్వాలని నిర్ణయించింది.
మంగళవారం విచారణలో, అగ్ని నోటిఫికేషన్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ రూపకల్పన, 150 ట్యాబ్లెట్‌ల సరఫరా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సంజయ్ కాంట్రాక్ట్ కంపెనీలతో కుమ్మకై నిధులు మళ్లించేశాడని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదించారు. 1.75 కోట్ల రూపాయల మేర నిధులు దుర్వినియోగం చేయడంపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పారు.
ఈ వార్త కూడా చదవండి

One thought on “ఏపీ సిఐడి మాజీ చీఫ్ ఎన్. సంజయ్‌పై అధికార దుర్వినియోగానికి విచారణ”
Comments are closed.