అవతార్ 3: జేమ్స్ కామెరూన్ ఆవిష్కరించిన అగ్ని ప్రపంచం

జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో ‘అవతార్‌’ (Avatar-3) ప్రపంచ చిత్ర పరిశ్రమలో ఓ సంచలనాన్ని సృష్టించింది. ఈ సినిమాతో పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి, దాని ప్రకృతి అందాలను కళ్లు చెదిరే విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు. తర్వాత ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar: The Way of Water) చిత్రంతో మరో అద్భుతం అందించారు. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీలో రానున్న మూడో భాగం ‘అవతార్-ఫైర్ అండ్ యాష్’ (Avatar: Fire and Ash) పేరుతో రూపొందుతోంది.

ఈ చిత్రం పంచభూతాల్లో అగ్ని సంబంధిత కాన్సెప్ట్‌ను ఆధారంగా తీసుకుని రూపొందించబడింది. జేమ్స్‌ కామెరూన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, “ఈ చిత్రం రెట్టింపు నిడివితో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. గత రెండు చిత్రాలతో పోలిస్తే, ఈ సినిమాలో కొత్తదనంతో కూడిన, ధైర్యంగా తీసుకున్న ఎంపికలు ఉన్నాయి. ఆపేక్షలతో పోలిస్తే, ఈ చిత్రం మరింత అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ సినిమా చూసినప్పుడు మీరు ఊహించలేనివి కనిపిస్తాయి,” అని అన్నారు.

అవతార్ 3 డిసెంబరు 19, 2025న విడుదల కానుంది. అవతార్‌ ఫ్రాంచైజీలో రానున్న ‘అవతార్-4’ 2029లో, ‘అవతార్-5’ 2031 డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఈ వార్త కూడా చదవండి

Subscribe to our YouTube channel

One thought on “అవతార్ 3: జేమ్స్ కామెరూన్ ఆవిష్కరించిన అగ్ని ప్రపంచం

Comments are closed.