దావోస్‌లో సీఎం చంద్రబాబు: ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలతో పెట్టుబడుల చర్చలు

దావోస్‌లో సీఎం చంద్రబాబు పర్యటన: పెట్టుబడులపై భారీ చర్చలు

అమరావతి, జనవరి 21: దావోస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు కూడా విజయవంతంగా కొనసాగుతోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈరోజు వెల్స్‌పన్ చైర్మన్ బీకే గోయింకా, ఎల్జీ కెమ్ సీఈవో షిన్ హక్ చియోల్, కార్ల్స్‌బెర్గ్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్, టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, వాల్‌మార్ట్ సీఈవో కాత్ మెక్‌లే, సిస్కో సీఈవో చుక్ రాబిన్స్, కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ తదితరులతో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు.

గ్రీన్ హైడ్రోజన్‌పై ప్రత్యేక చర్చలు
గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్, ఎనర్జీ ట్రాన్సిషన్, బ్లూ ఎకానమీ వంటి అంశాలపై వరుస సమావేశాలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అలాగే, సింగపూర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాన్ కిమ్ యాంగ్, యూఏఈ ఎకానమీ మినిస్టర్‌తోనూ ముఖ్యమంత్రి ప్రత్యేక చర్చలు నిర్వహించారు.

మిట్టల్ గ్రూప్‌తో కీలక చర్చలు
దావోస్ పర్యటనలో భాగంగా మిట్టల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్, సీఈఓ ఆదిత్య మిట్టల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా ఏపీలో 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై చర్చలు జరిగాయి.

అంతర్జాతీయ మీడియాతో ఇంటర్వ్యూలు
దావోస్‌లో బ్లూమ్‌బెర్గ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను ప్రపంచానికి వివరించారు.

ఈ వార్త కూడా చదవండి

One thought on “దావోస్‌లో సీఎం చంద్రబాబు: ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలతో పెట్టుబడుల చర్చలు

Comments are closed.