కర్ణాటకలోని బీదర్‌లో సెక్యూరిటీ వాహనంపై కాల్పులు జరిపి, ఏటీఎంలో పెట్టాల్సిన రూ.93 లక్షలను దోచుకువెళ్లిన మరుసటి రోజే దుండగులు మంగళూరు సమీపంలో ఏకంగా బ్యాంకును దోచుకోవడం కలకలం రేపింది.
కర్ణాటక: పట్టపగలే బ్యాంకు దోపిడీ
ఆయుధాలతో వచ్చి.. ఖాతాదారులనూ బెదిరించి..
తుపాకీ గురిపెట్టి రూ.10 కోట్లకు పైగా అపహరణ
పోలీసులు ఏం చేస్తున్నారు?: సీఎం సీరియస్
బెంగళూరు, నవంబర్ 17 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని బీదర్‌లో సెక్యూరిటీ వాహనంపై కాల్పులు జరిపి, ఏటీఎంలో పెట్టాల్సిన రూ.93 లక్షలను దోచుకువెళ్లిన మరుసటి రోజే, దుండగులు మంగళూరు సమీపంలోని బ్యాంకును దోచుకోవడం కలకలం రేపింది. దక్షిణ కన్నడ జిల్లా ఉళ్లాల తాలూకా కేసీ రోడ్డులోని కోటెకారు వ్యవసాయ సేవా సహకార సంఘం (VSS) బ్యాంకులో శుక్రవారం మధ్యాహ్నం మరో భారీ చోరీ జరిగింది.
ఆయుధాలతో వచ్చిన దుండగులు బ్యాంకులో ఉన్న రూ.10 కోట్లకు పైగా నగదు, ఆభరణాలను దోచుకుపోయారు. ఐదుగురు దొంగలు ఫియట్ కారులో వచ్చి బ్యాంకులోకి ప్రవేశించి, తుపాకులు, తల్వార్‌లతో ఖాతాదారులు, ఉద్యోగులను బెదిరించారు. క్యాషియర్ వద్ద ఉన్న నగదును తీసుకున్నారు. సేఫ్ రూం నుంచి అప్పుడే బయటకు వచ్చిన మేనేజర్‌కు తుపాకీ గురిపెట్టి, సేఫ్ రూం ను తెరిపించారు. లాకర్లలోని నగదు, బంగారు ఆభరణాలను దోచుకుని వచ్చి, కారులో పరారయ్యారు. తమను వెంబడిస్తే కాల్చివేస్తామని హెచ్చరించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కేవలం పది నిమిషాల్లో దోపిడీ జరిపినట్లు బ్యాంకు ఉద్యోగి రామచంద్ర తెలిపారు. దోపిడీకి వచ్చినవారు 30 సంవత్సరాలు కంటే తక్కువ వయస్కలవారు అని, హిందీలో మాట్లాడారని తెలిపారు.
ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తను కూడా చదవండి:

One thought on “కర్ణాటకలో పట్టపగలే బ్యాంకు దోపిడీ: రూ.10 కోట్లు అపహరణ”
Comments are closed.