బాలకృష్ణ – తమన్ కాంబో: బాక్సులు బద్దలవుతున్నాయి!
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుస హిట్లతో బాక్సాఫీస్‌ను దుమ్ము రేపుతున్నారు. రీసెంట్‌గా విడుదలైన ‘డాకు మహారాజ్’ సినిమా నాలుగు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్‌ను దాటి, బాలయ్య కెరీర్‌లో అరుదైన రికార్డు సృష్టించింది. మరింత ఆసక్తికరం ఏమిటంటే, ఈ విజయాలన్నీ తమన్ సంగీత సారథ్యంలో రావడం.
బాలకృష్ణ, తమన్ కాంబినేషన్ అంటే మాస్ ఆడియెన్స్ పూనకాలు తెచ్చుకోవడం గ్యారంటీ. ఇప్పటికే ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి మూడు బ్లాక్‌బస్టర్లతో ఈ కాంబో హ్యాట్రిక్ హిట్లు కొట్టింది. ఇక ఈ సంక్రాంతికి వచ్చిన ‘డాకు మహారాజ్’ కూడా మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఇక ఈ కాంబో ప్రాజెక్టులు అనౌన్స్ అవుతాయంటేనే థియేటర్ యాజమాన్యాలు భయపడిపోతున్నాయట. “ఎక్కడ మా సౌండ్ బాక్సులు బద్దలు అవుతాయో!” అంటూ టెన్షన్ పడుతున్నారట. మాస్ ఆడియెన్స్ మాత్రం ఈ కాంబోకి పూనకాలు వచ్చేసి ఎగిరిపడుతున్నారు.
డాకు మహారాజ్ ప్రమోషన్స్‌లో తమన్ మాట్లాడుతూ, “బక్కోడికి రజినీ, బండోడికి బాలయ్య” అంటూ చెప్పిన డైలాగ్ బాగా వైరల్ అయింది.
ప్రస్తుతం బాలకృష్ణ 2.0 నడుస్తోంది. “ఇకపై తానేంటో చూపిస్తా!” అని బాలయ్య ధీమాగా చెప్పిన మాటలు ఇంకా అభిమానుల చెవుల్లో మోత మొదలవుతున్నాయి. ఈ కాంబోలో ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ రూపొందుతోంది. ఈ సినిమా మహా కుంభమేళాలో గ్రాండ్‌గా చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక తమన్ మాత్రం ఈ సినిమా ద్వారా మరోసారి “బాక్సులు బద్దలు కొట్టేందుకు” రెడీ అవుతున్నారు.
‘అఖండ 2’ కోసం మీరు రెడీనా?
ఇవి కూడా చదవండి:

One thought on “బాలకృష్ణ – తమన్ కాంబో: బాక్సాఫీస్ షేక్ చేసే జంట”
Comments are closed.