రాష్ట్రవ్యాప్తంగా జనవరి 26న ప్రారంభం అవనున్న రైతు భరోసా పథకం: మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రకటనా

సిద్దిపేట: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ తెలిపారు, “జనవరి 26వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తాము.” సోమవారం (జనవరి 7వ తేదీ) సిద్దిపేట జిల్లా, అక్కన్నపేట మండలం, రామవరంలో రూ. 25 కోట్లతో చేపట్టే హుస్నాబాద్‌ – రామవరం డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఆయన, కంది కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “కందుల మద్దతు ధర 7,550 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందని, రైతులు ఆ మద్దతు ధరకు కందులను అమ్ముకోవాలని కోరుకుంటున్నాము. వడ్లకు 48 గంటల్లో పేమెంట్ చేశామని, సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చామని” అన్నారు.

తదుపరి మాట్లాడుతూ, “రాష్ట్రవ్యాప్తంగా జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తామని, భూములేని రైతు కూలీలకు రూ. 12,000 చెల్లిస్తామని ప్రకటించారు. అలాగే, వ్యవసాయ భూములన్నింటికి రేషన్ కార్డులు అందించాలని, రైతు భరోసా పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటిని అందజేస్తామన్నారు.”

అదేవిధంగా, “గుట్టలు, రాళ్లు రప్పలు, రోడ్లు, నాలా కన్వెన్షన్ ఉన్న భూములకు రైతు భరోసా పథకం వర్తించదు. భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ కానుక కింద రూ. 12,000 అందజేస్తామని” కూడా ఆయన స్పష్టం చేశారు.

జనవరి 26 నుండి కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ ప్రకటించారు.

ఈ వార్త కూడా చదవండి